సరిలేరు నీకెవ్వరు టాప్.. వెనకబడ్డ బన్నీ

సరిలేరు నీకెవ్వరు టాప్.. వెనకబడ్డ బన్నీ



సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు, టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకులకు మరింత అంచనాలు నెలకొన్నాయి.
అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరుకి పోటీగా ఒక్క రోజు గ్యాప్‌లోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న అలవైకుంఠపురంలో సినిమా జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. అయితే ముందు నుంచి ఈ రెండు సినిమాల మధ్య పాటల విషయంలో కానీ, రిలీజ్ డేట్స్ విషయంలో కానీ నువ్వ నేనా అన్న మాదిరి పోటీ కనిపిస్తూ వచ్చింది. అయితే కొన్ని విషయాలలో మాత్రం బన్నీ, మహేశ్ రికార్డ్స్‌ను క్రాస్ చేయలేకపోతున్నాడు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ టాప్‌లో కొనసాగుతుంటే అలవైకుంఠపురలో ట్రైలర్ రెండవ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇదొక్కటే కాదు బుక్ మై షో వంటి యాప్‌లలో కూడా బన్నీ వెనకబడే ఉన్నాడు. మోస్ట్ ఇంట్రెస్టెడ్ తెలుగు మూవీగా సరిలేరు నీకెవ్వరు మొదటి స్థానంలో ఉంటే, రజినీ దర్బార్ రెండవ స్థానంలో ఉండగా , అల వైకుంఠపురంలో మూడవ స్థానానికి పరిమితమయ్యింది.

Comments

Popular posts from this blog

ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు